Biotechnology: బ‌యోటెక్నాల‌జీ రంగంలో... భ‌విష్య‌త్‌ బంగారం! 7 d ago

featured-image

జంతువులు, మొక్క‌ల్లో అవ‌స‌ర‌మైన‌ మార్పులు చేయ‌డానికి లేదా ర‌క‌ర‌కాల ప్ర‌యోజ‌నాల కోసం సూక్ష్మ‌జీవుల‌ను ఉత్ప‌త్తి చేయడం, ఆర్ధిక ప‌రంగా వాటిని ఉప‌యోగించ‌డ‌మే బ‌యోటెక్నాల‌జీ. నేడు బ‌యోటెక్నాల‌జీ రంగంలో విద్య‌, ఉపాధి అవ‌కాశాలు విస్తారంగా ఉన్నాయి.

ఫార్మాస్యూటిక‌ల్‌, డ‌యాగ్నోస్టిక్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, ఎన్విరాన్‌మెంట‌ల్ త‌దిత‌ర రంగాల‌కు అవ‌స‌ర‌మ‌య్యే ప్రొడ‌క్ట్స్ ని బ‌యోటెక్నాల‌జీ అభివృద్ది చేస్తోంది. మొక్క‌లు, జంతువుల‌కు సంబంధించిన డీఎన్ఏ స‌మాచారాన్ని అభివృద్ది ప‌రిచి, మాన‌వాళికి మేలు చేకూర్చ‌డంలో బ‌యోటెక్నాల‌జీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ నేప‌థ్యంలో బ‌యోటెక్నాల‌జీ రంగంలో విద్య‌, ఉపాధి, ప‌రిశోధ‌న‌ల్లో గ‌ల అవ‌కాశాల‌ను గురించి తెలుసుకుందాం....


బ‌యోటెక్నాల‌జీ ప‌రిజ్ఞానంతో త‌ల్లిదండ్రుల నుండి వంశ‌పారంప‌ర్యంగా పిల్ల‌ల‌కు వ‌చ్చే వ్యాధులు , న‌యంకాని జ‌బ్బుల‌ను త‌గ్గించేందుకు కొత్త వ్యాధి నిరోధ‌కాల‌(వ్యాక్స‌న్‌)ను త‌యారు చేస్తున్నారు. వివిధ వ్యాధుల‌ను త‌ట్టుకునే సంక‌ర‌జాతి మొక్క‌ల‌ను, జంతువుల‌ను వృద్ధి చేస్తున్నారు. ప్ర‌త్యామ్నాయ ఇంధ‌న వ‌న‌రుల‌ను క‌నుక్కోవ‌డం, అడ‌వుల సంర‌క్ష‌ణ‌..... జ‌న్యుమార్పుల‌ను చేసి కొత్త జీవుల‌ను ఉత్ప‌త్తి చేయ‌డం, క‌ణ‌జాల వ‌ర్ధ‌నం, వ్య‌వ‌సాయం, ఔష‌ధం, త‌దిత‌ర రంగాల‌ ప‌రిశోధ‌న‌ల‌కు బ‌యోటెక్నాల‌జీ ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగిస్తున్నారు.


బ‌యోటెక్నాల‌జీలో విద్య న‌భ్య‌సించ‌డానికి మ‌న దేశంలో అనేక కోర్సులున్నాయి. ఈ కోర్సు ప్రాధాన్య‌త‌కు త‌గ్గ‌ట్లు ప‌లు సంస్ధ‌లు, విశ్వ‌విద్యాల‌యాలు కాలానుగుణంగా మార్పులు, చేర్పులు చేసి డిగ్రీ, పీజీ స్ధాయుల్లో అనేక కోర్సుల‌ను అందిస్తున్నాయి.


రాష్ట్రస్ధాయిలో.....

బ‌యోటెక్నాల‌జీ ఇంజినీరింగ్‌ను ఎంచుకోవాల‌నుకునే వారు ఇంట‌ర్మీడియ‌ట్ స్ధాయిలో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ(MPC/BiPC) గ్రూప్ తీసుకొని ఆయా స‌బ్జెక్టుల్లో మంచి ప్రావీణ్యం ఉండాలి. అన్ని ఇంజినీరింగ్ బ్రాంచ్‌ల మాదిరిగానే ఆంధ్రప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ ద్వారానే బ‌యోటెక్నాల‌జీ ఇంజినీరింగ్‌లో ప్ర‌వేశం క‌ల్పిస్తారు.


జాతీయ స్ధాయిలో......

జాతీయ స్ధాయిలో ఐఐటీ, నిట్‌లు బ‌యోటెక్నాల‌జీ ఇంజినీరింగ్‌ కోర్సుల‌ను అందిస్తున్నాయి. వీటిలో ప్ర‌వేశాలు జేఈఈ-అడ్వాన్స్‌డ్ ర్యాంక్ ఆధారంగా ప్ర‌వేశం క‌ల్పిస్తారు.


డిగ్రీ/పీజీ స్ధాయి కోర్సులు:

బీఎస్సీ (బ‌యోటెక్నాల‌జీ), బీఎస్సీ బ‌యోఫార్మ‌టిక్స్‌, బీటెక్ బయోటెక్నాల‌జీ, ఎంఎస్సీ బ‌యోటెక్నాల‌జీ, ఎంఎస్సీ అగ్రిక‌ల్చ‌ర్ బ‌యోటెక్నాల‌జీ, ఎంఎస్సీ/ ఎంవీఎస్సీ యానిమ‌ల్ బ‌యోటెక్నాల‌జీ, ఎంఎస్సీ మెరైన్ బ‌యోటెక్నాల‌జీ, ఎంఎస్సీ మెడిక‌ల్ బ‌యోటెక్నాల‌జీ, ఎంటెక్ బ‌యోటెక్నాల‌జి, ఎంటెక్ బ‌యోమెడిక‌ల్ ఇంజినీరింగ్/బ‌యోటెక్నాల‌జీ, ఎంబీఏ బ‌యోటెక్నాల‌జీ వంటి ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వివిధ విశ్వ‌విద్యాల‌యాలు బ‌యోటెక్నాల‌జీలో ప‌రిశ్ర‌మ‌ల అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని ప్ర‌త్యేక కోర్సుల‌ను అందిస్తున్నాయి.


ప‌రిశోధ‌నావ‌కాశాలు:

బ‌యోటెక్నాల‌జీలో ఉన్న‌త స్ధాయి ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హిస్తోన్న దేశాల్లో భార‌త్ అగ్ర‌శ్రేణిలో ఉంది. మాన‌వ జీనోమ్ ప్రాజెక్టు, మూల‌క‌ణ ప‌రిశోధ‌న‌, జ‌న్యు ప‌రివ‌ర్తిత పంట‌ల‌కు సంబంధించి మ‌న‌దేశంలో విస్తృతంగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. దీనికోసం కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేకంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ బ‌యోటెక్నాల‌జీ (డీబీటీ) ఏర్పాటైంది.


ఉద్యోగావ‌కాశాలు:

బ‌యోటెక్నాల‌జీలో విద్య‌న‌భ్య‌సించిన డిగ్రీ, పీజీ ప‌ట్ట‌భ‌ద్రుల‌కు మ‌న దేశంతోపాటు విదేశాల్లోనూ ఉపాధి అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. బ‌యోటెక్ కోర్సులు చేసినవారికి ప్రైవేటు రంగంలో స్ధాపించిన బెంగ‌ళూరు, ల‌క్నో, గుర్గావ్‌ల‌లోని బ‌యోటెక్ పార్కులు, హైద‌రాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, ఐసీఐసీఐ నాలెడ్జ్ పార్క్ లాంటి పారిశ్రామిక కేంద్రాల్లో ఉద్యోగ అవ‌కాశాలు ఉంటాయి. బ‌యోటెక్ అభ్య‌ర్ధులకు ఫార్మా, అగ్రిక‌ల్చ‌ర్ ఫార్మా, అగ్రికల్చ‌ర్‌, హార్టిక‌ల్చ‌ర్‌, డెయిరీ త‌దిత‌ర రంగాల్లో ఉపాధి అవ‌కాశాల‌తోపాటు, ప‌రిశోధ‌న‌లు చేసే అవ‌కాశ‌ముంది.

మ‌న దేశంలో ప్ర‌ముఖ కంపెనీలైన డాబ‌ర్‌, రాన్‌బాక్సీ, హిందుస్థాన్ లీవ‌ర్‌, డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్స్‌, థాప‌ర్ గ్రూప్‌, ఇండో అమెరిక‌న్ హైబ్రిడ్ సీడ్స్‌, బైకూన్ ఇండియా లిమిటెడ్‌, ఐడీపీఎల్‌, హిందుస్ధాన్ యాంటిబ‌యోటిక్స్ త‌దిత‌ర సంస్ధ‌లు డిగ్రీ ప‌ట్ట‌భ‌ద్రుల‌కు ఉద్యోగావ‌కాశాలు క‌ల్పిస్తున్నాయి. 


భ‌విష్య‌త్ ఎలా ఉండాల‌నేది ఇంట‌ర్ త‌ర్వాత తీసుకునే నిర్ణ‌యంపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. ఇంట‌ర్ త‌ర్వాత ఎన్నో దారులు ఉన్నా బ‌యోటెక్నాల‌జీ రూటే వేరు. భ‌విష్య‌త్ ప‌రంగా అవ‌కాశాల ప‌రంగా విద్యార్ధుల‌కు బ‌యోటెక్నాల‌జీ ఇంజినీరింగ్ లో మంచి భ‌విష్య‌త్ ఉంద‌న‌డంటో ఎటువంటి సందేహం లేదు.


ఇది చదవండి: బయోమెడికల్ ఇంజనీరింగ్ తో.. కెరీర్ అవకాశాలు..

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD